logo

44 కేంద్రాల్లో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు

జిల్లాలో జూన్‌ 2 నుంచి 44 కేంద్రాల్లో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) జి.నరసింహులు తెలిపారు.

Published : 01 Jun 2023 05:33 IST

అధికారులతో చర్చిస్తున్న డీఆర్వో నరసింహులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో జూన్‌ 2 నుంచి 44 కేంద్రాల్లో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) జి.నరసింహులు తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) ఎస్‌.అబ్రహంతో కలిసి సమన్వయ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షలకు మొత్తం 9,473 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, అరగంట ముందుగా విద్యార్థులు కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 25 కేంద్రాలు, కొవ్వూరు పరిధిలో 19 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, సెక్షన్‌ 144 అమలులో ఉంటుందని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం, వైద్యశిబిరాల ఏర్పాటు, రవాణా, విద్యుత్తు సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ రామవర్మ, నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారిణి వినూత్న, డీటీవో సత్యనారాయణ, ఆర్టీసీ, తపాలా, పంచాయతీరాజ్‌, విద్యుత్తు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని