logo

మార్కుల కోసం చదవొద్దు..!

తరగతి గదుల్లో గంటల తరబడి పుస్తకాలు చదవకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొనసాగగలమని గ్రీన్‌కో గ్రూప్‌ సీఈవో, ఎండీ అనిల్‌ చలమలశెట్టి చెప్పారు.

Published : 01 Jun 2023 05:33 IST

వెంకట్‌నగర్‌, న్యూస్‌టుడే: తరగతి గదుల్లో గంటల తరబడి పుస్తకాలు చదవకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొనసాగగలమని గ్రీన్‌కో గ్రూప్‌ సీఈవో, ఎండీ అనిల్‌ చలమలశెట్టి చెప్పారు. ఐటీ, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో విజయాలు సాధించి సౌత్‌ ఇండియన్‌ బిజినెస్‌ అఛీవర్స్‌, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు అందుకున్న ఆయన బుధవారం జేఎన్‌టీయూకే 9వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

న్యూస్‌టుడే: యువతలో నైపుణ్యాలు పెరిగేందుకు ఏం చేయాలి?

అనిల్‌: పరిశోధనాత్మక విద్యతో మారుతున్న కాలంతో పోటీపడాలి. పరిశ్రమల్లో మార్పులకనుగుణంగా విద్యా విధానంలోనూ మార్పులు రావాలి. ఇంటర్న్‌షిప్‌లు ప్రోత్సహించినప్పుడే యువతలో నైపుణ్యం పెరిగి పరిశ్రమల అవసరాలు తీరతాయి.  

 గ్రీన్‌ కో గ్రూప్‌ ప్రధాన లక్ష్యం?

 2006లో సంస్థను స్థాపించాం. భారతీయ ఇంధన రంగంలో ముద్ర వేసేందుకు డిజిటల్లీ అనేబుల్‌ క్లౌడ్‌ ఎనర్జీ ప్లాట్‌ఫారం రూపొందించాం. పెరుగుతున్న సాంకేతికతలతో మౌలిక సదుపాయాలను సృష్టిస్తున్నాం.

యువత ముందున్న సవాళ్లు ఏంటి?

యువత ఆలోచనా ధోరణిలో మార్పురావాలి. పరిశోధనాత్మక అంశాలపై దృష్టిసారించాలి. ఉత్పత్తి ఏదైనా ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఆకట్టుకునేలా ఉండాలి. తద్వారా విద్యార్థి పారిశ్రామికవేత్తగా మారి ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతాడు. నైపుణ్యం సాధిస్తే పరిశ్రమలే వెతుక్కుంటూ వస్తున్నాయి. విద్యార్థులు నిరంతరం నూతన ఆలోచనలతో సాగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. అందుకు నిత్య విద్యార్థిలా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని