భూముల ధరలకు రెక్కలు
ఒక్కసారిగా భూముల ధరలు 30 నుంచి వంద శాతం పెంచడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.
ప్రాంతాల వారీగా పెంపు
న్యూస్‌టుడే, గాంధీనగర్(కాకినాడ)
కక్షిదారులు లేక వెలవెలబోతున్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
ఒక్కసారిగా భూముల ధరలు 30 నుంచి వంద శాతం పెంచడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గురువారం బోసిపోయాయి.
పెరిగిన ధరలు ఇలా...
* కాకినాడ నగరంలోని 2, 5, 6, 7, 13, 20, 28, 43 బ్లాకుల్లో గజం రూ.75వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.95వేలకు పెంచారు. కాకినాడ గ్రామీణం గంగనాపల్లిలో ఇప్పటి వరకు చదరపు గజం రూ.7వేలు ఉండగా, తాజాగా రూ.10,000కు పెంచారు.
* సూర్యారావుపేట నివాసప్రాంతం పార్టులో రూ.10వేల నుంచి 15వేలకు, డోర్ నంబర్ల వారీగా పలు ప్రాంతాల్లో రూ.15వేల నుంచి రూ.20 వేలకు పెంచారు.
* తూరంగిలో రూ.8వేల నుంచి రూ.11వేలకు పెంచగా, డోర్ నంబర్ల వారీగా కొన్ని ప్రాంతాల్లో రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెంచారు.
* కొవ్వాడ పరిధిలో రూ.6,500 నుంచి రూ.8,500కు, కరప మండలం నడకుదురులో రూ.4వేల నుంచి రూ.6వేలకు, పెదపూడి మండల పరిధిలోని ఏపీత్రయం, రామేశ్వరంలలో రూ.4,200 నుంచి రూ.6వేలకు పెంచారు.
* అపార్టుమెంట్లకు చెందిన కాంపోజిషన్ విలువలు సైతం భారీగా పెంచారు. గంగానపల్లిలో పల్లపుభూమి ఎకరా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచగా, మెరకభూమి ఎకరా రూ.48 లక్షల నుంచి 65 లక్షలకు పెరిగింది. ఇళ్లు నిర్మించుకోవానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఎకరా రూ.80 లక్షల నుంచి రూ.1.21 కోట్లకు పెరిగింది. ఇంటిస్థలాలు ఎకరా రూ.3,38,80,000 ఉండగా, ప్రస్తుతం రూ.4,84,00,000కు పెరిగింది.
నిశ్శబ్దంగా పెంచేసి.....
ఒకవైపు భూముల ధరలకు రెక్కలు వచ్చిన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సందట్లో సడేమియాగా బుధవారం రాత్రి మరో జీవో విడుదల చేసింది.పురపాలక సంఘాల పరిధిలో నివాస సముదాయాలకు ప్రస్తుతం చదరపు అడుగు రూ.1300 ఉండగా దానిని రూ.1400 పెంచారు. వాణిజ్య ప్రాంతాల్లో రూ.1300 నుంచి రూ.1700కు పెంచారు. గ్రామాల్లో ఆర్‌సీసీ, డాబా ఇళ్లకు చదరపు అడుగుకు రూ.650 ఉండగా, ప్రస్తుతం రూ.850కు పెంచారు. గ్రామాల్లో వాణిజ్యానికి ఉపయోగించే ప్రాంతంలో వెయ్యికి పెరిగింది. పెంకుటిళ్లు చదరపు అడుగు రూ.650 ఉండగా, దానిని 700కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ
-
Vizag: ‘విశాఖ వందనం’ పేరుతో రాజధాని హడావుడి
-
Drugs Case: నటుడు నవదీప్ ఫోన్లలో డేటా మాయం!
-
Chandrababu: ‘బాబుతో నేను’.. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం
-
Chandrababu: హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం
-
మనిషికి పంది గుండె.. రెండోరోజుకే చలోక్తులతో హుషారుగా ఉన్న రోగి!