పంట నష్టాల నివారణకు ముందస్తు సాగు జలాలు
ప్రకృతి విపత్తులను అధిగమించి పంటలను కాపాడుకోవడానికే ముందస్తుగా గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
స్విచ్‌నొక్కి నీటిని విడుదల చేస్తున్న మంత్రి వేణు, చిత్రంలో మంత్రి వనిత, కలెక్టరు మాధవీలత తదితరులు
ధవళేశ్వరం, న్యూస్‌టుడే: ప్రకృతి విపత్తులను అధిగమించి పంటలను కాపాడుకోవడానికే ముందస్తుగా గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టరు మాధవీలతలతో కలిసి ఆయన గురువారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద డెల్టా కాలువలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గోదావరిలో అందుబాటులో ఉన్న 8 వేల క్యూసెక్కుల నుంచి 2 వేల క్యూసెక్కులను తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాల సాగుకు విడుదల చేశామన్నారు. గత పాలకులు రూ.86,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి కేవలం రూ.15వేల కోట్లే మాఫీ చేశారని, వైకాపా ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.30,600 కోట్లు రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసిందని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముందస్తు నీటి విడుదలతో సకాలంలో రైతులు నారుమళ్లు వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేసిన నేపథ్యంలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకటరావు, జేసీ తేజ్‌భరత్, డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు, జలవనరులశాఖ చీఫ్ ఇంజినీరు ఆర్.సతీష్‌కుమార్, ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ సలహామండలి ఛైర్మన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
-
Samantha: ఆ మూవీ లొకేషన్లో సమంత.. ఫొటోలు వైరల్