ఇదేం స్పందన..?
వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురై కనిష్ఠంగా ఆరునెలలు, గరిష్ఠంగా రెండేళ్లు పూర్తయినా తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్లు కొందరు గతనెల 22న కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రం అందజేశారు.
తమ దీనస్థితిని వివరిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురై కనిష్ఠంగా ఆరునెలలు, గరిష్ఠంగా రెండేళ్లు పూర్తయినా తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్లు కొందరు గతనెల 22న కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రం అందజేశారు. తొలగింపునకు, సస్పెన్షన్‌కు గురైనవారు ఇలా 60 మంది ఉన్నారన్నారు. ఉద్యోగాల్లో తీసుకుని తమ కుటుబాలను ఆదుకోవాలని వారంతా కలెక్టర్ కృతికాశుక్లాను వేడుకున్నారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోగా, సమస్య పరిష్కరించినట్లు తమకు గతనెల 27న లేఖలు పంపించారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధిత డ్రైవర్లు గురువారం కలెక్టరేట్‌కు వెళ్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టకి తీసుకెళ్లారు. న్యాయం చేయకపోగా, సమస్యను పరిష్కరించనట్లు లేఖలు పంపడం అన్యామని, తిరిగి ఫిర్యాదును తెరవాలని కోరారు. ఫిట్‌నెస్ లేదని కొంత మంది డ్రైవర్లను విధుల నుంచి తొలగించినా, వారికి అందాల్సిన రాయితీలు ఇవ్వడం లేదని, ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొసమెరుపు: సస్పెండైన, శాశ్వతంగా తొలగించబడిన ఆర్టీసీ డ్రైవర్లు గురువారం మళ్లీ కలెక్టరేట్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకున్న ఆ శాఖ అధికారులు వారిని వెనక్కి పిలిపించారు. న్యాయస్థానాలు ద్వారా తిరిగి పోస్టింగ్‌లకు ఉత్తర్వులు తెచ్చుకున్న వారిని విధుల్లో చేర్చుకోవడానికి అంగీకరించారు. కాకినాడ డిపోలో ఇద్దరు డ్రైవర్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. న్యాయ స్థానాలను ఆశ్రయించకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి గురించి ఉన్నతాధికారుల నుంచి మార్గదర్శకాలు రాగానే విధుల్లో తీసుకుంటామని చెప్పి పంపించడం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’