రైతుల ఖాతాలకు రబీ ధాన్యం సొమ్ము
రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు 14,195 రైతులకు రూ.1,955 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.
మాట్లాడుతున్న మంత్రి కారుమూరి
వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు 14,195 రైతులకు రూ.1,955 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం ర.భ.శాఖ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 1.50 లక్షల మంది నుంచి గతనెల 31 వరకు 13,53,759 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని దీనికి రూ.2,763 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.1,955 కోట్లు తొమ్మిది రోజుల వ్యవధిలోనే చెల్లించామని, ఇంకా రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిని మరో వారం రోజుల్లో చెల్లిస్తామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెలా చిరుధాన్యాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించామన్నారు.
తెదేపా మేనిఫెస్టోపై...
ఇటీవల జరిగిన మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో టిష్యూపేపర్ వంటిదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు. గతంలో 650 వాగ్దానాలతో వెబ్‌సైట్‌లో పెట్టిన మేనిఫెస్టోను తీసేశారని, ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఆయన హయాంలో రూ.2,71,488 కోట్లు అప్పు చేస్తే జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత రూ.1.30 వేల కోట్లు అప్పుచేసి ప్రజలకు అందించే కార్యక్రమం చేశారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు
-
Video: పరిణీతి-రాఘవ్ పెళ్లి సంగీత్.. సీఎంలు కేజ్రీవాల్, మాన్ సందడి