logo

పాడిరైతులపై అదనపు భారం

జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిసంపదపైనే చిన్న, సన్నకారు రైతులంతా ఆధారపడుతున్నారు.

Published : 03 Jun 2023 04:23 IST

సీతానగరం, కొంతమూరు, న్యూస్‌టుడే: జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడిసంపదపైనే చిన్న, సన్నకారు రైతులంతా ఆధారపడుతున్నారు. గతంలో పదినుంచి 20 వరకు పశువులను ఇళ్లవద్దనే చూసుకునే వారు. ప్రస్తుతం పెరిగిన ఆర్థిక భారంతో రెండు లేదా మూడింటిని మాత్రమే చూసుకోగలుగుతున్నారు. గతంలో కూలీలతో వరికోతలు చేసే సమయంలో ఎండుగడ్డి ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది. నేడు యంత్రాలతో కోసిన గడ్డినే పశుగ్రాసంగా వాడుతున్నారు. ఇలా సేకరించిన గడ్డినిల్వ ఉండే పరిస్థితులు లేవు. దీంతో అవస్థలు తప్పడం లేదు.

మేత అవసరాలు తీరడం లేదు

జిల్లాలో పశుసంవర్థకశాఖ గణాంకాల ప్రకారం 2.12 లక్షల పాడిపశువులు ఉన్నాయి. వరిసాగు సాధారణ విస్తీర్ణం 1.96 లక్షల ఎకరాలు. 90 శాతానికి పైగా వరికోత యంత్రాలతోనే ధాన్యం ఒబ్బిడి చేస్తున్నారు. మిగతా పది శాతం మాత్రమే కూలీలతో కోతలు పూర్తి చేయిస్తున్నారు. పాడిపశువుల అవసరాలకు ఇది సరిపోవడం లేదు. గతంలో ఎకరా రూ.వెయ్యి లోపు ఉండేది. ప్రస్తుతం రూ.8 వేలకు పెరిగింది. ఎండుగడ్డిని కట్టలు కట్టేలా యంత్రాలు వచ్చాయి. ఎకరాలో సుమారు 70 నుంచి 80 వరకు 25 కిలోల బరువు ఉండేలా కట్టలు ఉంటున్నాయి. అలా చేలో కట్టకట్టినందుకు రూ.40, రవాణా ఖర్చులు రూ.40, ఇతరత్రా ఖర్చులు రూ.20 అవుతోంది. దీంతో 25 కిలోల ఎండుగడ్డి రూ.100 అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని