logo

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రారంభం

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం కాకినాడ జేఎన్‌టీయూలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 10 వరకు ఆదివారం మినహా వీటిని నిర్వహించనున్నారు.

Published : 04 Jun 2023 05:27 IST

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా, అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు శనివారం కాకినాడ జేఎన్‌టీయూలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 10 వరకు ఆదివారం మినహా వీటిని నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ కృతికాశుక్లా, అదనపు ఎస్పీ పి.శ్రీనివాస్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు  కాకినాడ జిల్లాకు సంబంధించి జేఎన్‌టీయూకేలో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు పరీక్షకు 460 మందికి 365  మంది హాజరైనట్లు చెప్పారు. పరీక్షల లైజన్‌ ఆఫీసర్‌, కుడా వైస్‌ ఛైర్మన్‌ కె.సుబ్బారావు, జేఎన్‌టీయూకే ప్రిన్సిపల్‌, పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యూవీ రత్నకుమారి, ఏపీపీఎస్సీ ప్రతినిధులు బీఎస్‌ఆర్‌ మూర్తి, బీవీవీఎస్‌ శేఖర్‌, కాకినాడ అర్బన్‌ తహసీల్దార్‌ పీవీ సీతాపతిరావు పాల్గొన్నారు.


సజావుగా సప్లిమెంటరీ పరీక్షలు

వెంకట్‌నగర్‌, న్యూస్‌టుడే: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో శనివారం సజావుగా జరిగినట్లు డీఈవో కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ తెలిపారు. రెండోరోజు హిందీ పరీక్షకు 1,581 మందికి 1200 మంది హాజరయ్యారన్నారు. పరీక్షల పరిశీలకులు,  తనిఖీ అధికారులు కేంద్రాలను తనిఖీ చేశారన్నారు.


ఏపీఈపీడీసీఎల్‌లో బదిలీలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ సంస్థ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 92 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఇద్దరు ఎస్‌ఈలతో పాటు 13 మంది ఈఈలు, డిప్యూటీ ఈఈలు 26 మంది, ఏఈఈలు 50మంది, జూనియర్‌ ఇంజినీర్లు ముగ్గురిని బదిలీ చేశారు.


నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌

వెంకట్‌నగర్‌, న్యూస్‌టుడే: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్షను కాకినాడ జిల్లాలో ఐయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రెండు విడతల్లో ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు   జరుగుతుందన్నారు. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రం గేట్లు మూసివేస్తామని, విద్యార్థులు కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని ఐయాన్‌ డిజిటల్‌ ఇన్‌ఛార్జి పి.భాస్కర్‌ తెలిపారు. ఈ కేంద్రంలో 470 మంది హాజరుకానున్నారని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని