logo

‘జగనన్నకు చెబుదాం’ పటిష్ఠంగా అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశించారు.

Published : 04 Jun 2023 05:27 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌  

కాకినాడ కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దీనికి సంబంధించి వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రంగా జరుగుతున్న కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలన్నారు.  జిల్లా ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇటీవల ఇక్కడ పర్యటించారని, ఆయన సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ సత్యనారాయణ, పశుసంవర్థకశాఖ జేడీ ఎస్‌.సూర్యప్రకాశరావు, డీఈవో కె.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని