logo

సీనియార్టీ తుది జాబితాల విడుదల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ అంకంలో మరో అడుగు పడింది. బదిలీలు కోరుకుంటూ మొత్తం 8,025 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published : 04 Jun 2023 05:27 IST

వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్న ఉపాధ్యాయులు  

పామర్రు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ అంకంలో మరో అడుగు పడింది. బదిలీలు కోరుకుంటూ మొత్తం 8,025 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు నిబంధనల ప్రకారం వచ్చిన పాయింట్ల ఆధారంగా ప్రొవిజనల్‌ (తాత్కాలిక) సీనియార్టీ జాబితా విడుదల చేశారు. అభ్యంతరాలు కోరగా 811 మంది వివిధ కారణాలు  ఆన్‌లైన్లో నమోదు చేశారు. అధికారులు అభ్యంతరాలను పరిష్కరించారు. వీటి ఆధారంగా అన్ని కేడర్ల తుది సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. ఆదివారం ఖాళీలు ప్రదర్శిస్తారు. 5, 6 తేదీల్లో ఉపాధ్యాయులంతా ఐచ్ఛికాలివ్వాలి.

ఎస్జీటీలకు ఇబ్బందులు: సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవడం క్లిష్టంగా మారింది. ఉమ్మడి జిల్లాలో బదిలీలకు 3,784 మంది ఎస్జీటీలు దరఖాస్తులిచ్చారు. ఆప్షన్లు నమోదుకు సేవ్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఐచ్ఛికాలు ఇచ్చుకునే ప్రక్రియలో భాగంగా తన సంఖ్య 1500 వరకు వచ్చిన ఉపాధ్యాయుడు కంప్యూటర్‌ ముందు కూర్చుని ఒకటి నుంచి 1500 నంబరు వరకు ఐచ్ఛికాలు నమోదు చేసేందుకు గంటలకొద్దీ సమయం పడుతోంది. విద్యుత్తు, సాంకేతిక అంతరాయాలు ఏర్పడితే నమోదు చేసుకున్న ఐచ్ఛికాల డేటా డిలీట్‌ అయ్యి మొదట్నుంచి నమోదు చేయాల్సి వస్తోందని, సేవ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని ఎస్జీటీలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని