logo

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహం ఈ నెల 7న కత్తిమండలోని ఆయన నివాసంలో జరగనుంది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు.

Published : 04 Jun 2023 05:34 IST

ఏర్పాట్లపై ఎమ్మెల్యే రాపాకతో మాట్లాడుతున్న కలెక్టరు, ఎస్పీ, జేసీ

మలికిపురం, న్యూస్‌టుడే: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహం ఈ నెల 7న కత్తిమండలోని ఆయన నివాసంలో జరగనుంది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. సీఎం పర్యటన నిమిత్తం చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా, స్థానిక అధికారులతో కలెక్టరు హిమాన్షుశుక్లా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడి సత్యజ్యోతి సినిమా హాలు సమీపంలోని ఖాళీ స్థలంలో హెలిప్యాడ్‌ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టరు హిమాన్షు శుక్లా, జేసీ ధ్యానచంద్ర, ఎస్పీ శ్రీధర్‌ పరిశీలించారు. సీఎం హెలికాఫ్టర్‌లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే నివాసానికి చేరుకోడానికి ఉన్న రోడ్డు మార్గాలను వారు పరిశీలించారు.  ఎమ్మెల్యేతో కొద్ది సేపు కలెక్టరు మాట్లాడారు. స్థానిక డిగ్రీ కళాశాలలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ సీఎం వచ్చే హెలికాఫ్టరు దిగడానికి వీలుగా కొబ్బరి చెట్ల తొలగింపు, హెలిప్యాడ్‌ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు రహదారుల నిర్మాణం, మరమ్మతులు, వాహనాల పార్కింగ్‌, శానిటేషన్‌, అగ్నిమాపక అధికారులు, భద్రత చర్యలు తదితర అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరు మాట్లాడి సూచనలిచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా పాస్‌ల జారీపై ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడారు. తహసీల్దారు నరసింహారావు, ఎంపీడీవో బాబ్జీరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని