logo

వారాహి యాత్ర సాగేదిలా..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న అన్నవరం నుంచి ప్రారంభించనున్న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 24 వరకు జరుగుతుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌ తెలిపారు.

Published : 06 Jun 2023 05:25 IST

వివరాలు వెల్లడిస్తున్న కందుల దుర్గేశ్‌, పార్టీ నాయకులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న అన్నవరం నుంచి ప్రారంభించనున్న వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 24 వరకు జరుగుతుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌ తెలిపారు. సోమవారం కాకినాడలోని ముత్తా క్లబ్‌లో కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారాహి యాత్ర రూట్‌మ్యాప్‌ను వివరించారు. ఆయన తెెలిపిన వివరాల ప్రకారం..* 14వ తేదీ సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం పిఠాపురం చేరుకుని బస చేస్తారు.*15, 16 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో యాత్ర నిర్వహించి చేతివృత్తులు, చేనేత, వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటారు.* 16న పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించి అక్కడే రాత్రి బస చేస్తారు.* 17, 18, 19 తేదీల్లో ఆయన కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం నియోజక వర్గాల్లో యాత్ర నిర్వహిస్తారు. 19న కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ప్రదేశం ఖరారు కావాల్సి ఉంది.* 20 నుంచి 24 వరకు ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది.* యాత్రలో జనసేన శ్రేణులు పవన్‌కల్యాణ్‌కు పూలదండలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నామని దుర్గేశ్‌ చెప్పారు. క్రమశిక్షణతో యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. దశల వారీగా రాష్ట్రమంతటా వారాహి యాత్ర నిర్వహించేందుకు రూట్‌మ్యాప్‌ ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకోవడానికి పవన్‌కల్యాణ్‌ ఈ యాత్ర చేస్తున్నారన్నారు. సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు మేడా గురుదత్త ప్రసాద్‌, శెట్టిబత్తుల రాజబాబు, తుమ్మల బాబు, వరుపుల తమ్మయ్యబాబు, అత్తి సత్యనారాయణ, వేగుళ్ల లీలాకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాస్‌, పాఠంశెట్టి సూర్యచంద్ర, పోలిశెట్టి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని