logo

మాజీ ఎమ్మెల్యే వర్మ గృహ నిర్బంధం

తొండంగి మండలం పెరుమాళ్లపురంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మంగళవారం బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను పోలీసులు అడ్డుకున్నారు.

Published : 07 Jun 2023 05:22 IST

మూలపేటలోని ఇంట్లో కార్యకర్తలతో చర్చిస్తున్న వర్మ

కొత్తపల్లి: తొండంగి మండలం పెరుమాళ్లపురంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మంగళవారం బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను పోలీసులు అడ్డుకున్నారు. సెజ్‌ భూముల్లో మల్టీ ప్రొడక్టు  ఇండస్ట్రియల్‌ పార్కును నెలకొల్పితే తీర ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా మత్స్య సంపదకు ప్రమాదం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆది నుంచీ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుమాళ్లపురంలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు పిఠాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన బయలుదేరగా మూలపేట ప్రధాన కూడలిలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక తెదేపా నాయకుడి ఇంటిలో నిర్బంధించి పోలీసులు భారీగా మోహరించారు. సభ ముగిసే వరకు అక్కడే ఉంచి అనంతరం పోలీసు వాహనంలో కాకినాడలోని ఇంటికి తరలించారు.

మత్స్యకారులకు అన్యాయం చేస్తే సహించం..

కాకినాడ సెజ్‌ ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలు స్థాపించి మత్స్యకారులకు అన్యాయం చేస్తే సహించేదిలేదని వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిశ్రమలు స్థాపిస్తే పిఠాపురం, తుని, కాకినాడ నియోజకవర్గాల్లోని మత్స్యకారులు వలసవెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని