logo

తెదేపాతోనే రాష్ట్ర భవిష్యత్తు

వైకాపా హయాంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తెదేపాతోనే భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Updated : 07 Jun 2023 05:56 IST

మహానాడు విజయోత్సవ సభలో పార్టీ నాయకులు

దేవీచౌక్‌, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తెదేపాతోనే భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణం గాదాలమ్మనగర్‌లో మంగళవారం ‘మన  భవిష్యత్తుకు గ్యారెంటీ’, మహానాడు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌, ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు యర్రా వేణుగోపాలరాయుడు, లోహిత్‌ శిష్టా ్ల, కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. మహానాడు సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలందరి నోటా వినిపిస్తోందన్నారు. పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తే వైకాపాలో వణుకు ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌(వాసు) మాట్లాడుతూ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నగరంలో జరగడం అదృష్టమన్నారు. వర్షం వచ్చినా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము కట్టిన ఫ్లెక్సీలపై వైకాపా ఫ్లెక్సీలు కడితే ఎదుర్కొన్నామని, ఇబ్బంది పెట్టేవారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వాసిరెడ్డి రాంబాబు, కుడుపూడి సత్తిబాబు, దొండపాటి సత్యంబాబు, మజ్జి రాంబాబు, షేక్‌ సుభాన్‌, నక్కా దేవీవరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని