logo

రైల్వే ఎలక్ట్రికల్‌ విభాగంలో తనిఖీలు

రైల్వే చీఫ్‌ ఎలక్ట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఇంజినీర్‌ (సీఈడీఈ, సికింద్రాబాద్‌) సీహెచ్‌ఎస్‌రెడ్డి మంగళవారం కాకినాడలోని రైల్వే ఎలక్ట్రికల్‌ విభాగంలో తనిఖీలు చేపట్టారు.

Published : 08 Jun 2023 05:01 IST

పోర్టు రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న సీఈడీఈ సీహెచ్‌ఎస్‌ రెడ్డి

సాంబమూర్తినగర్‌ (కాకినాడ): రైల్వే చీఫ్‌ ఎలక్ట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఇంజినీర్‌ (సీఈడీఈ, సికింద్రాబాద్‌) సీహెచ్‌ఎస్‌రెడ్డి మంగళవారం కాకినాడలోని రైల్వే ఎలక్ట్రికల్‌ విభాగంలో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్‌ నుంచి ఆయన గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ టౌన్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పోర్టు రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడ ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌, లాకింగ్‌ సిస్టిమ్‌ను పరిశీలించారు. అనంతరం గూడ్స్‌ షెడ్‌తోపాటు పిట్‌లైన్‌ను తనిఖీ చేశారు. గూడ్స్‌ షెడ్‌లోని ఎలక్ట్రికల్‌ మెయింట్‌నెన్స్‌ పనుల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కాకినాడ టౌన్‌స్టేషన్‌ నుంచి రైలులో సికింద్రాబాద్‌  బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌, రైల్వే రక్షక దళం ఏఎస్‌ఐ శివశంకర్‌, సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని