logo

సీఎం పర్యటనా.. మజాకా!

అక్కడ జరుగుతున్నది ఓ ఎమ్మెల్యే తనయుడి వివాహ వేడుక. ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి వస్తున్నారాయె.

Published : 08 Jun 2023 05:01 IST

ఎండలో అవస్థలు పడుతూ చేరుకుంటున్న మహిళలు

పి.గన్నవరం, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, న్యూస్‌టుడే: అక్కడ జరుగుతున్నది ఓ ఎమ్మెల్యే తనయుడి వివాహ వేడుక. ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి వస్తున్నారాయె. అంతే ఆయనకు స్వాగతం పలికేందుకు డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ సిబ్బంది రావాల్సిందేనంటూ హుకుంలు జారీ అయిపోయాయి. మండుటెండలో వారంతా నడిరోడ్డుపై నిలబడి ఫ్లకార్డులు పట్టుకొని నరకం చవిచూశారు. అంతేకాదు సాధారణ ప్రయాణికులకు అధికారులు ఆంక్షలూ విధించేశారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో బుధవారం కనిపించిన పరిస్థితి ఇది.

రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ వచ్చారు. దీంతో ఆ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల డ్వాక్రా సభ్యులను, అంగన్వాడీ సిబ్బందిని డీఆర్‌డీఎ, ఐసీడీఎస్‌ అధికారులు ప్రైవేట్‌ వాహనాల్లో తీసుకువచ్చి స్వాగతం పలికించారు. ఉదయమే మలికిపురం వచ్చేయాలని స్పష్టం చేయడం వల్ల అనేకమంది అల్పాహారం కూడా తీసుకోకుండా రావడంతో నీరసించారు. ఉక్కపోత నుంచి రక్షణకు ప్లకార్డులనే వినియోగించారు. సీఎం హెలికాప్టర్‌ దిగి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు మలికిపురం రహదారిని పోలీసులు దిగ్బంధించడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

నిలిచిన వాహనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని