logo

ఆమె వేధింపుల నుంచి కాపాడండి

తన ఇద్దరు కుమారులపై అసత్య ఆరోపణలు చేస్తున్న రాజులపూడి ఆరుద్రపై చర్యలు తీసుకోవాలని శంఖవరం మండలం అన్నవరానికి చెందిన మెరపల చిన్నమ్మ దివ్యాంగుడైన తన మూడో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి గురువారం ధర్నా చౌక వద్ద నిరసన తెలిపారు.

Published : 09 Jun 2023 03:40 IST

నిరసన తెలుపుతున్న చిన్నమ్మలు, కుమారుడు శ్రీనివాస్‌

తన ఇద్దరు కుమారులపై అసత్య ఆరోపణలు చేస్తున్న రాజులపూడి ఆరుద్రపై చర్యలు తీసుకోవాలని శంఖవరం మండలం అన్నవరానికి చెందిన మెరపల చిన్నమ్మ దివ్యాంగుడైన తన మూడో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి గురువారం ధర్నా చౌక వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన ఇద్దరు కుమారులు వీరవెంకటసత్యనారాయణ, కన్నయ్య పోలీసుశాఖలో పనిచేస్తున్నారన్నారు.  ఆరుద్ర వారిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ కృతికాశుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఆరోగ్యం నిలకడగా ఉంది..

ఆరుద్ర, ఆమె కుమార్తె జీజీహెచ్‌లోని ఓపీ ఎస్‌ఎస్‌ఆర్‌లో ఉన్నారు. వారు చికిత్సకు, వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యపరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటాం.

డా.హేమలతాదేవి, కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

వైద్యుల సూచనల మేరకే తరలించాం...

దివ్యాంగురాలైన సాయిచంద్రలక్ష్మి ఆరోగ్యం బాగాలేదు. ఎండలకు నిరాహార దీక్ష చేయడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు వారిని ఆసుపత్రికి తరలించాం. తరలిస్తే బ్లేడుతో కోసుకుంటామని బెదిరించడంతో తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం.

కృష్ణభగవాన్‌, మూడో పట్టణ సీఐ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని