logo

లక్ష్మీ ప్రయుక్త ఆయుష్యహోమం పునరుద్ధరణ

అన్నవరం దేవస్థానంలో లక్ష్మీ ప్రయుక్త ఆయుష్యహోమం నిర్వహిస్తున్నట్లు అధికారులు, వైదిక సిబ్బంది తెలిపారు. లక్ష్మీహోమం, ఆయుష్య హోమం రెండూ కలిసి (ఒకటి తర్వాత మరొకటి) యాగశాలలో నిర్వహిస్తున్నారు.

Published : 09 Jun 2023 03:40 IST

హోమం నిర్వహిస్తున్న అర్చకులు

అన్నవరం: అన్నవరం దేవస్థానంలో లక్ష్మీ ప్రయుక్త ఆయుష్యహోమం నిర్వహిస్తున్నట్లు అధికారులు, వైదిక సిబ్బంది తెలిపారు. లక్ష్మీహోమం, ఆయుష్య హోమం రెండూ కలిసి (ఒకటి తర్వాత మరొకటి) యాగశాలలో నిర్వహిస్తున్నారు. దేవస్థానంలో  ప్రత్యేకంగా నిర్వహించే లక్ష్మీహోమాన్ని నిలుపుదల చేశారు. దర్బారు మండపాన్ని ఇటీవల తొలగించి ఇక్కడ క్యూలైన్లు (భక్తులు బయటకు వచ్చే మార్గం) నిర్మించారు. దీంతో పాటు హోమంలో పాల్గొనే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటోందని కొద్ది రోజులుగా రోజూ హోమం నిర్వహించడం లేదు. దీనిపై ‘ఈనాడు’లో ‘లక్ష్మీ హోమం నిలుపుదల’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు లక్ష్మీ హోమం, ఆయుష్యహోమం కలిపి యాగశాలలో లక్ష్మీ ప్రయుక్త హోమంగా నిర్వహించాలని నిర్ణయించి గురువారం నుంచి ప్రారంభించారు. ఒక హోమం పూర్తయిన తర్వాత మరొకటి నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఆయా హోమాల్లో భక్తులు వేర్వేరుగా పాల్గొనవచ్చన్నారు.

సత్యదేవుని చల్లని దర్శనం..

అన్నవరం సత్యదేవుని మూలవిరాట్‌ చుట్టూ ప్రదక్షిణ ద్వారా శీఘ్రదర్శనం (రూ.200 టికెట్టు) చేసుకునే భక్తులకు శీతల సదుపాయం (ఏసీలు) కల్పించారు. శీఘ్రదర్శనం టికెట్టు తీసుకునే భక్తులు ప్రధానాలయంలోకి వచ్చిన తర్వాత మూలవిరాట్‌ చుట్టూ ప్రదక్షిణ చేసి ఉత్తరద్వారం వద్ద నుంచి స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేలా ఇటీవల మార్పులు చేశారు. మూలవిరాట్‌ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో లైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బందిలేకుండా ఏసీలు, ఫ్యాన్లు (యంత్రాలయంలో మాదిరిగా) అమర్చారు. దీంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని