logo

పరిశ్రమల తాజా ప్రగతిపై సమీక్ష

ప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ ప్రవీణ్‌కుమార్‌ గురువారం సందర్శించారు. యాంకరేజి పోర్టు పరిశీలన అనంతరం సెజ్‌కు వెళ్లారు.

Published : 09 Jun 2023 03:40 IST

కాకినాడ సెజ్‌లో వివరాలు తెలుసుకుంటున్న ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌

ఈనాడు, కాకినాడ: కాకినాడ సెజ్‌ ప్రాంతాన్ని, పోర్టులను ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ ప్రవీణ్‌కుమార్‌ గురువారం సందర్శించారు. యాంకరేజి పోర్టు పరిశీలన అనంతరం సెజ్‌కు వెళ్లారు. ఇక్కడ ఏర్పాటుచేయనున్న బల్క్‌ డ్రగ్‌ పార్కు, ఇతర పరిశ్రమల తాజా ప్రగతి.. మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా భూముల అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు.. భారత మాల ప్రాజెక్టు ప్రగతి తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం సెజ్‌లో నూతనంగా నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌ (కేజీపీఎల్‌) పనులు, మ్యాపులను పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సెజ్‌, ఏపీఐఐసీ ఇతర అధికారులతో చర్చించారు. పర్యటనలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ హరిధర్‌, కాకినాడ సెజ్‌ ప్రాజెక్టు హెడ్‌ జి.సీతారామయ్య, కేజీపీఎల్‌ హెడ్‌ మంథా శ్రీనివాస్‌, ఇతర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని