వేగవంతంగా గృహ నిర్మాణాలు
జిల్లావ్యాప్తంగా సొంతిల్లు నిర్మించుకోవాలని ఆసక్తి ఉన్నవారికి రుణాలు మంజూరుచేసి నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు.
సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ హిమాన్షుశుక్లా
అమలాపురం కలెక్టరేట్: జిల్లావ్యాప్తంగా సొంతిల్లు నిర్మించుకోవాలని ఆసక్తి ఉన్నవారికి రుణాలు మంజూరుచేసి నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇళ్ల నిర్మాణాలు, లేఔట్లలో మెరక పనులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్నవారికి డ్వాక్రా సంఘాల ద్వారా రూ.35 వేల రుణం అందించాలన్నారు. గృహ నిర్మాణశాఖ జిల్లా అధికారి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం: కోనసీమ వ్యవసాయాధారిత ప్రాంతమని, వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆదేశించారు. కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు సంబంధించి రుణాలు విరివిగా ఇవ్వాలన్నారు. శుక్రవారం జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకు అధికారులు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వని కారణంగా వచ్చే వారం హాజరుకావాలన్నారు. దీంతో రుణ ప్రణాళికపై చర్చ లేకుండానే సమావేశం ముగిసింది. లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్యాం, నాబార్డు ప్రతినిధి స్వామినాయుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Andhra news: గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుబట్టిన కాగ్
-
Monsoon: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం: ఐఎండీ
-
Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు.. సిఫార్సులు తిరస్కరించిన తమిళిసై
-
LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే
-
Parineeti-Raghav: పరిణీతి పెళ్లికి రాలేకపోయిన ప్రియాంక చోప్రా.. అసలు కారణమిదే
-
Modi: కాంగ్రెస్.. ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుము: మోదీ తీవ్ర విమర్శలు