logo

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు

జిల్లాలోని శంఖవరం, హంసవరం ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 11న నిర్వహించే పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 10 Jun 2023 04:14 IST

అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్వో శ్రీధర్‌రెడ్డి

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని శంఖవరం, హంసవరం ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 11న నిర్వహించే పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శంఖవరం, హంసవరం ఆదర్శ పాఠశాలల్లోనే ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థులకు రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తమ శాఖల పరంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రశాంత వాతవరణంలో జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈవో కె.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు