నాణెం.. గణనాథుడుకి ప్రణామం
ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారివారి సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తుంటారు. అయినప్పటికీ వారంతా తమ సంప్రదాయాన్ని దాటి భక్తిభావాన్ని చాటారు.
తువాలు దేశం డాలర్ పై.. ధాయ్‌లాండ్ 10బాత్ నాణెం
న్యూస్‌టుడే, గాంధీనగర్: ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారివారి సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తుంటారు. అయినప్పటికీ వారంతా తమ సంప్రదాయాన్ని దాటి భక్తిభావాన్ని చాటారు. కాకినాడకు చెందిన నాణేల సేకర్త మార్ని జానకిరామ్ చౌదరి వద్ద ఉన్న నాణేలు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. మన దేశాన్ని అనేక మంది చక్రవర్తులు, రాజులు పాలించారు. వారంతా తమ కులదేవతలను నాణేలపై ముద్రించి భక్తిని చాటుకున్నారు. ఈ కోవలోనే 17, 18 శతాబ్దాల కాలంలో దక్షిణ హిందూ దేశాన్ని పాలించిన శివగంగ, మధురై నాయకరాజులు రాగి నాణేలపై విఘ్ననాయకుడిని ముద్రించి తమ భక్తిని చాటుకున్నారు. దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీపం తువాలు దేశం. 2018లో ఒక డాలరు విలువ కలిగిన నాణెంపై నృత్య గణపతిని పంచ రంగులతో ముద్రించింది. ఈ నాణెం మరోవైపు రాణి ఎలిజబెత్-2 చిత్రాన్ని ముద్రించారు. దక్షిణాసియాలోని థాయిలాండ్ దేశం హిందూ దేవతలతో కూడిన అనేక నాణేలు ముద్రించింది. 2012లో వినాయకుడి చిత్రంతో 10 బాత్‌ల విలువైన నాణెం విడుదల చేసి తమ భక్తిని చాటుకుంది. ఇండోనేషియా సైతం 1998లో ముద్రించిన ఇరవై వేల రూపియా నోటుపై ఆ దేశ విద్యా ప్రచారకర్త కి హజర్ దేవంతరా చిత్రంతోపాటు, వినాయకుడి చిత్రాన్ని ముద్రించింది. తొలి పూజలందుకునే గణనాథుడిపై భక్తిని చాటుతూ పలు దేశాలు తమ నాణేలు, కరెన్సీపై చిత్రాలు ముద్రించడం ఎంతో అభినందనీయం. భారతీయులకు గర్వకారణం.
ఇండోనేషియా 20 వేల రూపియా నోటు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.