నెలాఖరు వరకు ఈ-క్రాప్ నమోదు
జిల్లాలో ఈ-క్రాప్ నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని జేసీ తేజ్‌భరత్ తెలిపారు. గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో ఈ-క్రాప్ నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని జేసీ తేజ్‌భరత్ తెలిపారు. గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీఎం కిసాన్‌కు సంబంధించి అర్హత కలిగిన రైతుల ఈకేవైసీ లక్ష్యాలను సాధించేందుకు వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 58,456 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా 53 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్బీకేల ద్వారా ఇప్పటివరకు 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు విక్రయించినట్లు తెలిపారు. ఈ-పంట నమోదు ఈ నెల 30లోగా పూర్తి చేసి సామాజిక తనిఖీలు అక్టోబర్ 3 నుంచి 10 వరకు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీసీఆర్ కార్డులు పొందిన కౌలు రైతులకు పంట రుణాల మంజూరుకు బ్యాంకర్లతో మండల స్థాయి, ఆర్బీకే స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఔత్సాహిక రైతులు, నిరుద్యోగ యువతకు పశుసంవర్థక శాఖ ద్వారా జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ అమలు చేస్తున్న పథకాల వివరాలను ఆయా ఆర్బీకేల వద్ద వ్యవసాయ సహాయకుల ద్వారా పొందవచ్చని జేసీ తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో అర్హత ఉన్న కౌలురైతులందరికీ సీసీఆర్ కార్డులు అందజేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నందకిషోర్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!