logo

చంద్రబాబు ఆరోగ్య భద్రతపై అనుమానం

కేంద్ర కారాగారంలో ఉంటున్న ఖైదీ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Published : 22 Sep 2023 04:01 IST

ఖైదీ మృతి నేపథ్యంలో పార్టీ శ్రేణుల ఆందోళన

టి.నగర్‌(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: కేంద్ర కారాగారంలో ఉంటున్న ఖైదీ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం రాజమహేంద్రవరంలో అర్బన్‌ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షల్లో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య భద్రతపై అనుమానాలున్నాయన్నారు. ‘‘జైలులో దోమలు కుడుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు.. అదే జైలులో వ్యక్తి డెంగీతో చనిపోయాడు.. మా నాయకుడికి అక్కడ రక్షణ ఏముంది..? జైలులో పరిస్థితిపై మాకు అనుమానాలు ఉండవా..? చంద్రబాబు కుటుంబ సభ్యులు చాలా ఆందోళనలో ఉన్నారు.. జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న నేతకు భద్రత, సౌకర్యాలు కల్పించాలి.. లోపాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.. పెళ్లిరోజే కక్షతో జైలులో పెట్టినవారు చంద్రబాబు అరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారన్న నమ్మకం మాకు లేదు..’’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏమైనా హాని తలపెట్టే ఉద్దేశం ఉందేమోననే ఆనుమానం వ్యక్తమవుతోందన్నారు. అధికారులు స్పందించి బాబు ఆరోగ్యంపట్ల తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని