సీఎం దృష్టికి తీసుకువెళ్లి.. నా కుమారుడ్ని విడిపించండి
కోడికత్తి కేసులో జైల్లో మగ్గుతున్న తన కుమారుడు శ్రీనివాసరావును విడుదల చేయించాలని కోరుతూ అతని తల్లి సావిత్రి ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ను వేడుకున్నారు.
ఎమ్మెల్యే సతీష్‌కుమార్ ఎదుట కోడికత్తి శ్రీను తల్లి ఆవేదన
ముమ్మిడివరం, న్యూస్‌టుడే: కోడికత్తి కేసులో జైల్లో మగ్గుతున్న తన కుమారుడు శ్రీనివాసరావును విడుదల చేయించాలని కోరుతూ అతని తల్లి సావిత్రి ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ను వేడుకున్నారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. మండలంలోని ఠాణేలంకలో బుధవారం రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కలిసి సావిత్రి వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు నాలుగేళ్లకుపైగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. వృద్ధాప్యంలో ఉన్న తమకు అండగా ఉంటాడని, తమ కుమారుడి విడుదలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సావిత్రి కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
టీచర్ అవుదామనుకొని..
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య