logo

బొబ్బర్లంకలో మొసలి అలజడి

బొబ్బర్లంక వద్ద మధ్య డెల్టా కాలువలో గురువారం సాయంత్రం మొసలి ఒకటి అలజడి సృష్టించింది. హెడ్‌ స్లూయిస్‌ సమీపంలో ప్రధాన కాలువలో కనిపించడంతో ప్రజలు  ఆందోళనకు గురయ్యారు.

Published : 22 Sep 2023 04:01 IST

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: బొబ్బర్లంక వద్ద మధ్య డెల్టా కాలువలో గురువారం సాయంత్రం మొసలి ఒకటి అలజడి సృష్టించింది. హెడ్‌ స్లూయిస్‌ సమీపంలో ప్రధాన కాలువలో కనిపించడంతో ప్రజలు  ఆందోళనకు గురయ్యారు. కాలువల్లో స్నానాలు చేసేవారు, పశువుల కాపరులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాలువ నుంచి పరుగులు తీశారు. ఈ సమాచారం పరిసర గ్రామాల్లో వ్యాపించడంతో అప్రమత్తమయ్యారు. రెండు రోజుల పాటు కాలువలో నిమజ్జనాలకు దిగవద్దని పోలీసులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని