మద్యం మత్తులోనే విగ్రహం ధ్వంసం: డీఎస్పీ
రాజోలు మండలం సోంపల్లి పరిధిలోని పల్లిపాలెంలో కొలువుదీర్చిన వినాయక విగ్రహం ఎడమ చేతిని విరిచి, అక్కడున్న పంచలోహ విగ్రహం, రాగి కలశాన్ని అపహరించిన నిందితుడు కామాడి నాగరాజును రాజోలు పోలీసులు అరెస్టు చేశారు.
రాజోలు, న్యూస్‌టుడే: రాజోలు మండలం సోంపల్లి పరిధిలోని పల్లిపాలెంలో కొలువుదీర్చిన వినాయక విగ్రహం ఎడమ చేతిని విరిచి, అక్కడున్న పంచలోహ విగ్రహం, రాగి కలశాన్ని అపహరించిన నిందితుడు కామాడి నాగరాజును రాజోలు పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపేట డీఎస్పీ కె.వెంకటరమణ దీనికి సంబంధించిన వివరాలను రాజోలు పోలీస్ స్టేషన్‌లో గురువారం వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఉత్సవ కమిటీ నిర్వాహకుడు పొన్నమండ శ్రీకాంత్ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. మద్యానికి డబ్బులు కోసం నిందితుడు నాగరాజు పంచలోహ విగ్రహం, కలశాన్ని అపహరించి, తాగిన మైకంలో విగ్రహంపై పడడంతో ఎడమ చేయి మణికట్టు ధ్వంసమైంది. దొంగిలించిన వాటిని విక్రయించేందుకు బుధవారం రాజమహేంద్రవరం వెళ్తుండగా పొదలాడ కూడలిలో పోలీసుల చేతికి చిక్కాడు. నిందితుడి నుంచి 4.9 కిలోల పంచలోహ విగ్రహం, రాగి కలశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీధర్ చేసిన సూచనల మేరకు కొత్తపేట డీఎస్పీ ఆధ్వర్యంలో రాజోలు సీఐ గోవిందరాజు పర్యవేక్షణలో రాజోలు ఎస్సై పృధ్వీ, సిబ్బంది, అమలాపురం క్రైం పార్టీ ఏఎస్‌ఐ బాలకృష్ణ వేగవంతంగా చేసిన కృషితో నిందితుడ్ని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!