logo

నాడు ఒడ్డున.. నేడు కోత బారిన

ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఉన్న భారీ రాయిని పరిశీలిస్తే కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం తీరప్రాంత గ్రామాలపై సముద్ర కోత ప్రభావం ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.

Published : 24 Sep 2023 06:03 IST

2019లో ఉప్పాడలో గ్రామాన్ని ఆనుకుని ఉన్న భారీ రాయి

ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఉన్న భారీ రాయిని పరిశీలిస్తే కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం తీరప్రాంత గ్రామాలపై సముద్ర కోత ప్రభావం ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.. గతంలో ఈ భారీ రాయిని ఉప్పాడ తీరం ఒడ్డున ఆలయం నిర్మించేందుకు శంకుస్థాపన కింద వేశారు. 2019లో ఈ రాయి ఒడ్డున గ్రామాన్ని ఆనుకుని ఉండేది. ప్రస్తుతం అక్కడి నుంచి రెండు వందల మీటర్ల దూరంలో కనిపిస్తుంది. అంటే ఈ నాలుగేళ్లలో కిలోమీటరు మేర రెండు వందల మీటర్ల వరకు ఉప్పాడ నుంచి మాయాపట్నం మధ్యలో దాదాపు 150 ఇళ్లు సాగరంలో కలిసిపోయాయి. వారంతా నిలువ నీడ లేక రోడ్డున పడ్డారు. ఇలాగే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో తీరప్రాంత గ్రామాలు మిగలవన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
న్యూస్‌టుడే, కొత్తపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని