logo

శాస్త్రవేత్తలు విభిన్న అంశాలను లోతుగా పరిశీలించాలి

వాణిజ్య పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, కొత్త విధానాలకు సంబంధించి విభిన్న అంశాలను లోతుగా పరిశోధించాలని రాజమహేంద్రవరం కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ శేషుమాధవ్‌ శాస్త్రవేత్తలకు సూచించారు.

Published : 24 Sep 2023 06:05 IST

సదస్సులో సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ శేషుమాధవ్‌, ఆయా విభాగాధిపతులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): వాణిజ్య పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, కొత్త విధానాలకు సంబంధించి విభిన్న అంశాలను లోతుగా పరిశోధించాలని రాజమహేంద్రవరం కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ శేషుమాధవ్‌ శాస్త్రవేత్తలకు సూచించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్థానిక సీటీఆర్‌ఐలో రెండో రోజు శనివారం జరిగిన సమావేశంలో పంటల యాజమాన్య పద్ధతులు, భూసారం, రసాయన విభాగాల్లోని పరిశోధనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శేషుమాధవ్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉష్ణోగ్రత, వర్షపాతం, భూసార అంశాలు, నేలలోని అజో స్పైరిల్లమ్‌, ఫొస్ఫో బ్యాక్టీరియా, మైక్రోఫ్లొరా వంటి విభిన్న అంశాలను లోతుగా పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌ అగ్రానమి విభాగాధిపతి డాక్టర్‌ రవీంద్రాచారి మాట్లాడుతూ సమగ్ర పోషకాల యాజమాన్యంలో కచ్చితమైన పరిశోధన ప్రణాళికలు ఏర్పరచుకోవాలన్నారు. అప్పుడే పరిశోధనల ఫలితాలు, సంబంధిత సమాచారం ప్రమాణాలతో ఉంటుందన్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. పూర్వ విభాగాధిపతులు యు.శ్రీధర్‌, సి.చంద్రశేఖరరావు తదితరులు  శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని