logo

చంద్రబాబు కుటుంబంపై కక్ష సాధింపు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, ఆయన కుటుంబ సభ్యుల పట్లా రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Published : 24 Sep 2023 06:07 IST

పోస్ట్‌ కార్డుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, తదితరులు

అనపర్తి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, ఆయన కుటుంబ సభ్యుల పట్లా రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అనపర్తిలో పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సుధాకరరెడ్డి కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులు సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణను వేధిస్తుండగా, కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి రాజమహేంద్రవరంలో ఉంటుంటే, వారికి ములాఖత్‌లు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు, కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు అనపర్తి నియోజకవర్గ తరఫున బైక్‌ర్యాలీ నిర్వహించనున్నామని ఆయన ప్రకటించారు.

పోస్ట్‌కార్డులపై ఆరా

దేవీచౌక్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన పోస్ట్‌కార్డులపై తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం తెదేపా బాధ్యుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఆరా తీశారు. రాజమహేంద్రవరంలోని దానవాయిపేట ఉప తపాలా కార్యాలయానికి శనివారం వెళ్లినవారు చంద్రబాబునాయుడికి సంఘీభావం తెలుపుతూ ఎన్ని ఉత్తరాలు వచ్చాయి.. ఎన్ని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పంపారు.. అనే విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడు లక్షల వరకు వస్తే చంద్రబాబునాయుడికి 40 వేలు మాత్రమే చేరాయని ప్రశ్నించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ నాలుగు రోజులుగా 7, 8 బ్యాగులు(సుమారు 40 వేల వరకు కార్డులు) వస్తే అన్నింటిని కారాగారానికి పంపించి వేశామన్నారు. సాధారణ పోస్ట్‌కు లెక్కలు ఉండవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని