logo

ఉక్కు సంకల్పం

రాజమహేంద్రవరం నగరం.. క్వారీసెంటర్‌ వద్ద జరిగిన దీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పాల్గొని మాట్లాడారు. 30వ డివిజన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు

Published : 24 Sep 2023 06:14 IST

చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు ఉద్ధృతం

టి.నగర్‌, ఏవీఏ రోడ్‌, దానవాయిపేట, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగరం.. క్వారీసెంటర్‌ వద్ద జరిగిన దీక్షలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పాల్గొని మాట్లాడారు. 30వ డివిజన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ్ల్వ) రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరులో చేపట్టిన తెదేపా దీక్షలో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ పాల్గొని మాట్లాడారు. ్ల్వ) అనపర్తి నియోజకవర్గంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ్ల్వ) నిడదవోలు మండలం డి.ముప్పవరంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నేతృత్వంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. సమిశ్రగూడంలో కుందుల వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్నంగా మౌనదీక్ష చేపట్టారు.్ల్వ) చాగల్లు మండల నాయకులు కొవ్వూరు పట్టణంలో దీక్ష చేపట్టారు. నియోజకవర్గ తెదేపా ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, జనసేన నియజకవర్గ ఇన్‌ఛార్జి టీవీ రామారావు పాల్గొని మాట్లాడారు. రెండు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేటలో తెదేపా శ్రేణులు ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. తొలుత పోలీసులు వచ్చి వారిని ఆపేయడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. నాయకులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటికే విడిచిపెట్టగా వారు కార్యక్రమం కొనసాగించారు. ్ల్వ) గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల బేతేల్‌ చర్చిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ్ల్వ) సీతానగరం మండలం మునికూడలిలోని సోమేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టారు.

చేనేత పరిశ్రమ నిర్వీర్యం..

సీతానగరం: సీతానగరం మండలం వెలంపేట నుంచి కస్తూర్బాగాంధీ ఆశ్రమం వరకు తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తలపెట్టిన కాగడాల ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేట రామాలయం వద్ద రాజానగరం తెదేపా ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగడాల ప్రదర్శనకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో శిబిరం వద్దనే నిరసనలు వ్యక్తం చేశారు.

నేడు అనపర్తి నుంచి ‘చలో రాజమహేంద్రవరం’

అనపర్తి: చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు సంఘీభావం తెలిపేందుకు అనపర్తి నియోజకవర్గం నుంచి ఈనెల 24న (ఆదివారం) చలో రాజమహేంద్రవరం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్‌ ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని.. అనపర్తి దేవీచౌక్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని