logo

దారి దోపిడీ ఘటనలో ముగ్గురు హిజ్రాల అరెస్టు

అమలాపురం పట్టణ శివారు సావరం బైపాస్‌ రోడ్డులో అంబాజీపేట మండలానికి చెందిన యువకుడిని దారి దోపిడీ చేసిన ముగ్గురు హిజ్రాలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ అంబికాప్రసాద్‌ శనివారం రాత్రి తెలిపారు.

Published : 24 Sep 2023 06:16 IST

అమలాపురం పట్టణం: అమలాపురం పట్టణ శివారు సావరం బైపాస్‌ రోడ్డులో అంబాజీపేట మండలానికి చెందిన యువకుడిని దారి దోపిడీ చేసిన ముగ్గురు హిజ్రాలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ అంబికాప్రసాద్‌ శనివారం రాత్రి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి అటుగా వెళ్తున్న యువకుడిని ఆపి హిజ్రాలు కాసేపు కాలక్షేపం చేసి రూ.500 ఫోన్‌ పే చేయించుకున్నారు. ఆ తరువాత అతని మెడలోని బంగారు గొలుసు లాక్కుని పోతుండగా యువకుడు లాగేయడంతో కొంతముక్క తెగిపోయింది. మిగిలిన గొలుసుతో ఆ ముగ్గురూ ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. దీనిపై అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందుకున్న సీఐ వీరబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ జోషి కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. కాకినాడ వలసపాకలకు చెందిన రెల్లి రవి అలియాస్‌ స్వీటీ (20), రేచర్లపేటవాసులు ఏడిద రమేష్‌ అలియాస్‌ కీర్తి (21), గుల్లపల్లి రాజు అలియాస్‌ అమూల్య (23)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి ద్విచక్ర వాహనాన్ని, 4.7 గ్రాముల బంగారం చైన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అమలాపురం కోర్టులో శనివారం హాజరుపరిచి రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని