logo

‘జగన్‌ను సాగనంపాలి’

తండ్రి పేరు అడ్డుపెట్టుకుని ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ సానుభూతి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎద్దేవా చేశారు.

Published : 24 Sep 2023 06:18 IST

మాట్లాడుతున్న నాగేశ్వరరావు, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు తదితరులు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: తండ్రి పేరు అడ్డుపెట్టుకుని ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ సానుభూతి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు సమర్థతతో ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రలో ప్రజల ఆదరణతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్‌లో రిలే దీక్షల శిబిరంలో 10వ రోజు శనివారం బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొనగా దీక్షలను కొండబాబు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని జగన్‌ ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునేందుకు ఉపయోగిస్తున్నారని, ప్రశ్నించేవారిని జైలుకు పంపించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ప్రజలు ఆయనను ఒక్క ఛాన్స్‌కే పరిమితం చేసి, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాక్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు సైతం రోడ్డెక్కి మద్దతుగా నిలవడమే దీనికి నిదర్శనమన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ నాగిడి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్‌ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని, ఆయన ఓటమిని ఎవరూ ఆపలేరని చెప్పారు. కార్యక్రమంలో నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు, పార్టీ జిల్లా నాయకులు గ్రంధి బాబ్జి, హోతా రవి, భమిడిపాటి శ్రీకృష్ణ, బచ్చు శేఖర్‌, అద్దేపల్లి గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని