logo

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

యువత హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలని కాకినాడ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ అన్నారు.

Published : 24 Sep 2023 06:20 IST

పరుగును ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో నరసింహ నాయక్‌

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: యువత హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలని కాకినాడ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ అన్నారు. జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా 5కె రన్‌ (మారథాన్‌)ను శనివారం భానుగుడి కూడలిలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. భానుగుడి నుంచి సర్పవరం కూడలి వరకు తిరిగి భానుగుడి వరకూ పరుగు సాగింది. కాకినాడ పీఆర్‌ డిగ్రీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఐడియల్‌ డిగ్రీ కళాశాల, పిఠాపురం, తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులు మారథాన్‌లో పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు, ఏడుగిరికి రూ.వెయ్యి చొప్పున, ముగ్గురు మహిళలకు ప్రత్యేకంగా రూ.వెయ్యి చొప్పున బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు, ఎయిడ్స్‌, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేశ్‌, డీపీఎం ఆదిలింగం, ఎయిడ్స్‌, క్షయ నివారణ విభాగం సిబ్బంది, ఏఆర్‌టీ సిబ్బంది, రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ వైడీ రామారావు, రిలయన్స్‌ సంస్థ ప్రతినిధి సుబ్రహ్మణ్యం, పీఈటీ సిబ్బంది, 108 సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని