ముగ్గురి ఉసురు తీసిన విద్యుత్తు తీగలు
ఆయిల్‌పామ్ తోటలో సబ్‌మెర్సిబుల్ పంపు మరమ్మతులు చేస్తుండగా ఇనుపగొట్టాలు పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఘటనాస్థలంలో మృతదేహాలు
గండేపల్లి, జగ్గంపేట, జగ్గంపేట గ్రామీణం, కిర్లంపూడి, న్యూస్‌టుడే: ఆయిల్‌పామ్ తోటలో సబ్‌మెర్సిబుల్ పంపు మరమ్మతులు చేస్తుండగా ఇనుపగొట్టాలు పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి విద్యుదాఘాతంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గండేపల్లి మండలం ఉప్పలపాడు పరిధిలో శనివారం ఉదయం 8.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో జగ్గంపేట మండలం సీతారాంపురానికి చెందిన రైతు గళ్లా నాగరాజు అలియాస్ బాబి (26), జగ్గంపేటకు చెందిన కిల్లి నాగేశ్వరరావు అలియాస్ నాగు (45), కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బుదిరెడ్డి సూరిబాబు (40) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రైతు నాగరాజు తోటలో మోటారు మరమ్మతులు చేయడానికి బోరుకు మూడు వైపులా గొట్టాలను అమర్చుతుండగా పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగలకు ప్రమాదవశాత్తు తగిలాయి. విద్యుదాఘాతంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గ్రామస్థులు ఆందోళనకు దిగి ఎలక్ట్రికల్ ఏడీఈ, ఏఈలను నిలదీశారు. బాధితులను ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.
మూడు గ్రామాల్లో విషాదం
ముగ్గురి మృతితో సీతారాంపురం, జగ్గంపేట, బూరుగుపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయిల్‌పామ్ తోటలో మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జగ్గంపేటకు చెందిన నాగేశ్వరరావు బోర్ల మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుమారుడు గణేష్, కుమార్తె రమాదేవిని డిగ్రీ వరకు చదివించారు. మృతదేహంపై పడి పిల్లలు, భార్య లక్ష్మి బోరున విలపించారు.
కుటుంబ బాధ్యతలు మోస్తూ..
సీతారాంపురానికి చెందిన గళ్లా నాగరాజు తండ్రి అప్పారావు పదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి నాగమణి కుటుంబ బాధ్యతలు స్వీకరించి ఇద్దరు కొడుకులు, కుమార్తెలను పెద్ద చేసింది. చిన్న కుమారుడు నాగరాజు చదువుకుంటూనే కుటుంబ బాధ్యతలతో తల్లికి చేదోడువాదోడుగా నిలిచేవాడు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సీతారాంపురంలో అన్నదానం ఏర్పాటు చేయడంతో బోరు మరమ్మతులను వాయిదా వేయాలని అనుకున్నారు. మెకానిక్ ఆటోలో పరికరాలను తీసుకురావడంతో వారితో పాటు పొలం వెళ్లి మృత్యువాతకు గురయ్యారు.
పెద్దదిక్కును కోల్పోయి...
కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన బొద్దిరెడ్డి సూరిబాబు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతడికి భార్య గంగ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆటో కిరాయికి వెళ్లి సామాన్లు దించేసి రాకుండా పరోపకారంతో అక్కడున్న వారికి సాయపడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్థులు చెబుతున్నారు. పిల్లలకు దిక్కెవరంటూ భార్య గంగ రోదిస్తున్న తీరు అక్కడున్నవారిని కలచివేసింది.
బాధితుల ఆందోళన..
పెద్దాపురం: బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పెద్దాపురం ప్రభుత్వాసుపత్రి ఎదుట జనసేన, ఏపీ రైతు కూలీ సంఘం, సీపీఎం నాయకులు బైఠాయించారు. రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని విద్యుత్తు శాఖ డీఈఈ రత్నాలు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం, తహసీల్దార్లు సత్యనారాయణ, జితేంద్ర ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. సీఐలు సూర్యఅప్పారావు, షేక్ అబ్దుల్ నబీ పరిస్థితిని పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తుని, కోటనందురు మండలాల్లో భారీ వర్షం
[ 06-12-2023]
కోటనందురు మండలం కాకరాపల్లి వద్ద బొండు గడ్డ వాగు పొంగిపొర్లుతోంది. -
అన్నదాతలను ఆదుకుంటాం
[ 06-12-2023]
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని కలెక్టర్ మాధవీలత రైతులకు సూచించారు. -
అన్నవరం కొండపై ఎగిరిపడిన రేకు: ఇద్దరికి గాయాలు
[ 06-12-2023]
అన్నవరం కొండపై మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సుడిగాలి తీవ్రతతో వార్షిక కల్యాణ వేదిక వద్ద తాత్కాలిక షెడ్డు రేకు ఎగిరిపడి ఇద్దరు మహిళా భక్తులకు గాయాలయ్యాయి. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
[ 06-12-2023]
సీసీ కెమెరాకు మట్టి పూసి రంగంపేట మండలం వడిశలేరులోని కెనరా బ్యాంకు ఏటీఎం చోరీకి గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. -
సృజన చూపుదాం.. సత్తా చాటుదాం..
[ 06-12-2023]
విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే సమయం ఆసన్నమైంది. సృజనాత్మకతను చాటేందుకు వేదిక సిద్ధమైంది. -
మిగ్జాం ముంచేసింది..
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో వీచిన గాలులు, కురిసిన భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేశాయి. -
అపార నష్టం.. కోలుకోలేని కష్టం
[ 06-12-2023]
రెండే రెండు రోజులు రైతుల కలలను తలకిందులు చేసేశాయి.. ఇష్టపడి, కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నేలవాలిపోయింది. -
శిశుగృహ ప్రహరీ కూలి పిల్లల ఆందోళన
[ 06-12-2023]
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, దానవాయిపేట: రాజమహేంద్రవరం మహిళా కళాశాల ఎదురుగా బాల సదనానికి చెందిన గోడ మంగళవారం రాత్రి భారీ వర్షానికి నాని కూలిపోయింది. -
27 ఏళ్లు.. ఉప్పెన ఆనవాళ్లు
[ 06-12-2023]
మిగ్జాం తుపానును ఎదుర్కొనేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం యానాంలో చర్యలు చేపట్టిన నేపథ్యంలో 1996 నవంబరు 6న పెను తుపాను మిగిల్చిన విషాదాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. -
అధికారులూ.. అప్రమత్తంగా ఉండండి
[ 06-12-2023]
మిగ్జాం తుపాను పట్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లావాసులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చాలని ప్రత్యేకాధికారి జి.జయలక్ష్మి ఆదేశించారు. -
ఖజానా శాఖ అధికారికి ఎస్టీయూ నోటీసు
[ 06-12-2023]
ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించడంలో జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో మంగళవారం నోటీసు అందజేశారు. -
తుపాను నష్ట నివారణకు ముందస్తు చర్యలు
[ 06-12-2023]
తుపాను నష్ట నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర అధికారులతో సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టిందని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ తెలిపారు. -
సుడిగాలి బీభత్సం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం, మరోవైపు ఈదురుగాలులు, భయంకరమైన సుడిగాలులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
రేవంత్ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన బండ్ల గణేశ్
-
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
-
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ భేటీ
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్‌స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
-
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం