logo

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 24 Sep 2023 13:10 IST

జగ్గంపేట: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  జగ్గంపేటలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న కాకిలపాటి నాగేంద్రప్రసాద్ (16) అనే యువకుడు 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.  మృతుడు జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు.  మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని