logo
Updated : 28/11/2021 06:24 IST

అవగాహన లేక అవస్థలు

ఈకేవైసీ చేస్తేనే ధాన్యం కొనుగోలు

రెండు నియోజకవర్గాల్లో నమోదైంది 55 శాతమే


రైతులతో ఈకేవైసీ చేయిస్తున్న సిబ్బంది

పండించిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఈ-క్రాప్‌, ఈకేవైసీలను ప్రామాణికంగా పరిగణిస్తోంది. కొందరు రైతులు ఈ-పంట నమోదు చేయించి ఈకేవైసీపై అవగాహన లేక దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో ధాన్యం విక్రయ సమయంలో ఇబ్బంది పడతారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో సుమారు 55 శాతం మాత్రమే ఈకేవైసీ చేయించారు.

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే

అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను వేదికగా చేసింది. వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. వరి ‘ఏ’ గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.1960, సాధారణ రకం రూ.1940 ధర నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరలో కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

95 శాతం ఈ-క్రాప్‌..: గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయాధికారులు ఈ-క్రాప్‌లో 95 శాతానికి పైగా పంట నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నెల 26 వరకు ఈకేవైసీకి 41682 మంది రైతులు వేలి ముద్ర వేశారు. మిగిలిన 22279 మంది నమోదు చేయాల్సి ఉంది. అవగాహన లేక కొందరు, భూమి యజమాని అనుమతి ఇవ్వలేదని, అందుబాటులేక మరికొందరు ఇతర కారణాలతో వేలిముద్రల సేకరణ జరగలేదు. బ్యాంకు ఖాతా, ఫోన్‌, ఆధార్‌ అనుసంధానం లేకపోవడం తదితర కారణాలతో ఈకేవైసీ నమోదు చేయలేదు.

ఎందుకు చేయాలంటే..

రైతులు స్థానికంగా లేకపోయినా వారి పేరుతో దళారులు ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిలో కొందరితో కుమ్మక్కై పంట వేయకపోయినా వేసినట్లు ఈ-క్రాప్‌లో బుక్‌ చేయించి సొమ్ము చేసుకొంటున్నారు. అలాగే, బ్యాంకు ఖాతాలు పనిచేయక కొందరు రైతుల పంట సొమ్ము, రాయతీ లబ్ధి ఖాతాలో జమకావడం లేదు. అలాంటి నిజమైన రైతులు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వాటిని దృష్టిలో ఉంచుకుని ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారి నుంచే కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలందాయి.

రెండూ ఉంటేనే..

ధాన్యం అమ్మకాలకు సంబంధిత రైతులు ఈ-క్రాప్‌, ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేయడం వీలుకాదు. ఇప్పటికే గ్రామాల్లో పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాం. ఈకేవైసీ చేయించుకునే రైతులు సంబంధిత వీఏఏలను సంప్రదించాలి. - ఉషారాణి, ఏడీఏ, రేపల్లె

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని