logo
Published : 28/11/2021 01:37 IST

సరదాగా గడిపి.. శవమై కనిపించాడు

గణపవరం (నాదెండ్ల), న్యూస్‌టుడే: ఓ యువకుడు రాత్రిపూట కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి తెల్లవారేసరికి శవమై కనిపించిన సంఘటన నాదెండ్ల మండలం గణపవరంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గణపవరానికి చెందిన అవివాహితుడు పెడవల్లి అనిల్‌ (28) కారు చోదకునిగా పనిచేస్తున్నాడు. విజయవాడలో ఓ నాయకుని వద్ద విధులు నిర్వహిస్తున్న యువకుడు రెండ్రోజుల క్రితం గ్రామానికొచ్చాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులందరితో చరవాణిలో స్వీయ చిత్రాలు దిగాడు. బయటకు వెళ్లి వస్తానన్నాడు. రాత్రి 11 గంటల సమయంలో మిత్రులకు హాయ్‌ అని సందేశం పెట్టాడు. శనివారం ఉదయం జాతీయ రహదారి సమీపంలో నీటి శుద్ధి పరిశ్రమ వద్ద విగతజీవిగా కనిపించాడు. మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి మృతి చెందినట్లు భావిస్తున్నారు. బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని