Published : 28 Nov 2021 01:37 IST
అటవీ భూముల్లో సాగుచేస్తే చర్యలు
గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎఫ్ఓ రామచంద్రయ్య
పిడుగురాళ్ల, న్యూస్టుడే : అటవీ భూములను సాగుచేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో రామచంద్రయ్య అన్నారు. శనివారం గుత్తికొండ అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వేమగిరి గ్రామస్థులతో మాట్లాడుతూ అటవీ భూములను అక్రమించిన వారిపై గతంలో కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం ఎవరైనా సాగు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాటిలైట్ సర్వే చేయిస్తామని పేర్కొన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో ఎన్.ఎస్.బి.రాజు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు నివేదికను అందజేస్తామని తెలిపారు. అక్కడకు వెళ్లిన వారిలో రేంజర్ మల్లికార్జునరావు ఉన్నారు.
Tags :