logo
Published : 28/11/2021 01:37 IST

మిమ్మల్ని మంత్రిగా చూడాలని ఉంది

ఉప సభాపతిని ఉద్దేశించి ఎమ్మెల్యే బొల్లా వ్యాఖ్యలు

రఘుపతి దంపతులను సన్మానిస్తున్న బ్రహ్మనాయుడు

వినుకొండ, న్యూస్‌టుడే: సార్‌.. మిమ్మల్ని మంత్రిగా చూడాలని ఉంది... మల్లికార్జునస్వామి దయవలన అయితే మాకు చాలా సంతోషం.. ఎన్నికల సమయంలో సాయం చేశారు.. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తుందని శాసనసభ డిప్యూటి స్పీకర్‌ కోన రఘుపతి నుద్దేశించి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. శ్రీశైలం వెళుతూ శనివారం డిప్యూటీ స్పీకర్‌ దంపతులు వినుకొండలో కొద్దిసేపు ఆగారు. వారికి ఎమ్మెల్యే బొల్లా పూలమాలలు వేసి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ముచ్చటించారు. బాపట్లలో మీరు చేసిన రహదారుల అభివృద్ధిని చూస్తే సంతోషంగా ఉందని, పట్టణంలో తాను రూ.10 కోట్లతో కైలాసగిరి పేరుతో శ్మశానం వద్ద గదులు కట్టిస్తున్నామని దాతలిచ్చిన విరాళాలతోనే వాటిని పూర్తి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. బ్రాహ్మణ కల్యాణ మండపానికి అవసరమైన స్థలం కేటాయిస్తానని డిప్యూటీ స్పీకర్‌ను కలిసేందుకు వచ్చిన ఆ సంఘం నాయకులకు ఆయన హామీ ఇచ్చారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని