logo
Published : 28/11/2021 01:37 IST

ఎకరాకు రూ.30 వేల పరిహారానికి డిమాండ్‌


దెబ్బతిన్న వరి పంట పరిశీలిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

బాపట్ల, న్యూస్‌టుడే : ప్రచార ఆర్భాటం తప్ప రైతు సంక్షేమంపై వైకాపా ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. బాపట్ల మండలం ఈతేరు, గుడిపూడిలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న వరి పంటను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలన్నారు. పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ, కార్యదర్శి నక్కల వంశీకృష్ణ, నేతలు బాలు, కిశోర్‌, సురేంద్ర, మురళీకృష్ణ, ఆదిశేషు, బాలాజీ, సుజిత్‌, మణికంఠ పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని