logo
Published : 28/11/2021 01:37 IST

అన్నం పెట్టడం లేదని తల్లి ఆత్మహత్యాయత్నం


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు

రామాపురం(దాచేపల్లి), న్యూస్‌టుడే: కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రామాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురజాల మండలం దైదకు చెందిన కోటమ్మకు ఐదుగురు సంతానం. నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం రామాపురంలో కుమార్తె వద్ద ఉంటోంది. అయినప్పటికీ పిల్లలు తనకు ఓ ముద్ద భోజనం పెట్టకుండా చిన్నచూపు చూస్తున్నారని ఆవేదనకు లోనై, బతుకు మీద విసిగిన ఆమె రామాపురంలోని గ్రామ సచివాలయం పక్కనే ఉన్న బావిలో దూకింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన ఎస్సై లేళ్ల సుధీర్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సహకారంతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. తాళ్లను తెప్పించి మంచానికి కట్టి అందులో పోలీసులు కూర్చొని బావి లోపలికి వెళ్లి ఆమెను బయటకు తీశారు. అప్పటికే ఆమెకు చేయి విరగడంతో నారాయణపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధురాలి ప్రాణాన్ని కాపాడిన ఎస్సై సుధీర్‌కుమార్‌ చొరవను పలువురు అభినందించారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని