పెరటి తోట.. ఆరోగ్య పంట!
పిట్టలవానిపాలెం, న్యూస్టుడే కూరగాయలు కావాలంటే.. వాళ్లు సంచి పట్టుకుని మార్కెట్కు వెళ్లరు. పెరట్లోకి వెళ్తారు... అప్పుడే కోసిన తాజా కూరగాయలనే వినియోగిస్తారు. సంగుపాలెం, కోడూరు, పిట్టలవానిపాలెం, అల్లూరుకు చెందిన పలువురు మహిళలు ఇంటి పెరటినే పచ్చని క్షేత్రంగా మార్చేశారు. సేంద్రియ విధానంలో సాగు చేస్తూ నాణ్యమైన ఉత్పత్తులు పొందుతున్నారు.
ఆహ్లాదం.. ఆనందం
కోడూరుకు చెందిన డి.ఉషారాణి తమ ఇంటి వద్ద ఖాళీ స్థలంలో మూడేళ్లుగా కూరగాయల తోటలు పెంచుతున్నారు. సేంద్రియ ఎరువులు ఉపయోగించి వంగ, బెండ, టమాటా, పొట్ల, చిక్కుడు, జామ, వివిధ రకాల ఆకుకూరలు, పూల మొక్కలు సాగు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ రోజూ కొంత సమయాన్ని మొక్కల సంరక్షణకు కేటాయిస్తున్నారు. పచ్చని ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా పొందుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇంటి ప్రాంగణంలో ఖాళీ స్థలంలో విభిన్న రకాల కూరగాయల మొక్కలు, పూలు, పండ్ల చెట్లు పెంచుతూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
సొమ్ము ఆదా..