నీకు నువ్వే పోటీ..
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఘట్టమనేని కృష్ణ, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావులతోపాటు నేటి తరంలో యువ దర్శకులు
క్రిష్, బోయపాటి శ్రీనులది గ్రామీణ నేపథ్యమే. మారుమూల గ్రామాల నుంచి పట్టుదలతో ఉన్నతస్థితికి చేరుకున్నారు.
ప్రత్యేక సమావేశంలో నూజివీడు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి వ్యాఖ్యలు
కొత్త వాతావరణం.. ఆత్మన్యూనతాభావం.. ఉద్ధేశపూరకంగా కొందరు చూపించే చులకన భావాన్ని తట్టుకోలేక ట్రిపుల్ ఐటీతోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ చదువులకు ఎన్నో ఆశల్ని మోసుకుంటూ వెళ్తున్న గ్రామీణ విద్యార్థుల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీతోపాటు గుంటూరు, విజయవాడ నగరాల్లోని ఇంటర్మీడియట్ కళాశాలలు.. విశ్వవిద్యాలయాల్లో గడచిన కొన్ని సంవత్సరాలు విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
అత్యున్నత స్థానాల్లో గ్రామీణులు
నగర, పట్టణ ప్రాంత విద్యార్థులకంటే గ్రామీణ ప్రాంతం వారే శారీరకంగా.. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది.
గత దశాబ్దకాలంగా సివిల్స్ ఫలితాల్ని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అతి సామాన్య కుటుంబాలకు చెందిన యువత అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మొత్తం 6000
వారిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు 70% సుమారు
పిల్లలందరూ ఒకటే అనే భావన పెంపొందించాలి..
పాఠశాల తరువాత చదువులకు గ్రామాల్ని విడిచి వేరే ప్రాంతాల్లోని విద్యాలయాల్లో చదువుకునే సమయంలో చాలామంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిలో సర్దుబాటు సమస్య ప్రధానమైనది. కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యేలా కౌన్సెలింగ్ ఇవ్వాలి. పిల్లలందరూ ఒకటే అనే భావన పెంపొందించాలి. విలువలతో కూడిన విద్యనందించాలి.ఆత్మనూన్యతా భావం, ఒత్తిడిలాంటి సమస్యల్ని ఎదుర్కొనే వారిని గుర్తించి వారి చదువులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఆత్మహత్యలకు అవకాశం ఉండదు. - డాక్టర్ టీఎస్ రావు, కౌన్సిలింగ్ సైకాలజిస్టు
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఎనిమిదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివినట్లు ఆయన పలుమార్లు వెల్లడించారు. ఆ తరువాత ఆంగ్లంతోపాటు బహుభాషలపై పట్టు సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.