logo
Updated : 28/11/2021 06:20 IST

ఆక్వా.. సరికొత్త బాట 

సాంకేతికత తోడుగా తక్కువ ఖర్ఛు. అధిక దిగుబడులు

బాపట్ల, న్యూస్‌టుడే జిల్లాలోని తీర ప్రాంతంలో తొమ్మిది వేల హెక్టార్లకుపైగా రొయ్యలు, చేపల చెరువులు ఉన్నాయి. 2010 సంవత్సరానికి ముందు అందరూ టైగర్‌ రొయ్యలు సాగు చేసేవారు. వ్యాధులు ప్రబలి విపరీతంగా నష్టాలు రావడంతో చిన్న, సన్నకారు రైతులు సాగుకు దూరమయ్యారు. కొత్తగా వచ్చిన వనామీ రొయ్యల సాగు 2016 వరకు లాభాల వర్షం కురిపించింది. పెట్టుబడి ఖర్చులు పోను ఎకరాకు రూ.5 లక్షలు పైగా ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రొయ్య పిల్లల నాణ్యత తగ్గడం, వైట్‌ గట్‌, వైట్‌ స్పాట్‌, రన్నింగ్‌ మోర్టాలిటీ, ఫంగస్‌ వ్యాధులు ఎక్కువగా రావడం, మార్కెట్లో ధరలు పడిపోవటంతో గత నాలుగేళ్లుగా విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కొత్త రకాలు ఎంపిక చేసుకొని సాగును లాభసాటిగా మార్చుకుంటున్నారు.

పండు చేప

గిట్టుబాటు కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు : రొయ్యల మేత, మందుల వ్యయం 30 శాతానికి పైగా పెరగడం, దిగుబడులు తగ్గడంతో రైతులకు సాగు గిట్టుబాటు కాని పరిస్థితి. వాతావరణం అనుకూలించకుంటే కనీసం పెట్టుబడి కూడా దక్కదు. గతంలో బొచ్చెలు, రాగిండి చేపలు ఎక్కువగా సాగు చేసేవారు. మార్కెట్లో పండు చేపలకు మంచి గిరాకీ ఉంది. కాస్త పెట్టుబడి ఎక్కువైనా గాని ఈ రకం చేపల సాగుపై మొగ్గుచూపుతున్నారు. నిజాంపట్నం, దిండి, పెదపులుగువారిపాలెంలో పీతలు, పండు చేపల సాగు ప్రారంభించారు. ఎకరాకు రూ.రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఎకరాకు 4500 పిల్లలు పోస్తున్నారు. 85 శాతం పిల్లలు బతుకుతున్నాయి. తొమ్మిది నుంచి పది నెలలు పెంచి కేజీ నుంచి రెండు కేజీలకు పైగా బరువు ఉన్న చేపలు విక్రయిస్తున్నారు. కేజీ చేప ధర రూ.300, రెండు కేజీల చేప ధర రూ.450 వరకు పలుకుతోంది. ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తోంది. చేపల విక్రయం ద్వారా రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. చందువాల తరహాలో సిల్వర్‌ ప్యాంపనో(ముక్కుడు పార) రకం చేపలు సాగు చేస్తున్నారు. తమిళనాడు నుంచి పండు చేపలు, పీతల పిల్లలు తీసుకొస్తున్నారు.

తీర ప్రాంత రైతులు ఆక్వా సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కేవలం సంప్రదాయంగా చేపలు, వనామీ రొయ్యల సాగుకు పరిమితం కాకుండా కొత్త రకాలు సాగు చేసి లాభాలు అందుకుంటున్నారు. మోనో టైగర్‌, పండు చేపలు, పీతలు పండిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి దిగుబడులు పెంచడానికి కృషి చేస్తున్నారు.

ఆశలు చిగురింపజేస్తున్న కొత్త రొయ్యలు

మోనో టైగర్‌ రకం రొయ్యలను గత మార్చి నుంచి రైతులు పండిస్తున్నారు. కొన్ని హేచరీల వద్దే రొయ్య పిల్లలు ఉత్పత్తి అవుతుండటంతో సాగు పరిమితంగా ఉంది. ఎకరాకు 40 వేల పిల్లలు పోస్తుండగా పెట్టుబడి ఖర్చు రూ.రెండున్నర లక్షల వరకు అవుతోంది. నాలుగు నెలల్లో 15 కౌంట్‌ రొయ్యలు వస్తున్నాయి. ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. కేజీ రొయ్యల ధర రూ.800పైనే పలుకుతోంది. ఖర్చులన్నీ పోనూ ఎకరాకు రూ.ఐదు లక్షల వరకు లాభం వస్తోంది. రొయ్య పిల్లలకు డిమాండ్‌ బాగా ఉండటంతో కొత్త హేచరీల్లో ఉత్పత్తి చేస్తున్నారు. రానున్న ఫిబ్రవరిలో నలభై శాతం విస్తీర్ణంలో మోనో టైగర్‌ రొయ్యలు సాగు చేయడానికి సాగుదారులు సిద్ధమవుతున్నారు.

మోనో టైగర్‌ వైపు మళ్లుతున్నారు

వనామీ రొయ్యల సాగులో వరుసగా మూడేళ్లు నష్టాలు వచ్చాయి. ధైర్యం చేసి మోనో టైగర్‌ రొయ్యలు రెండు ఎకరాల్లో సాగు చేశా. ఖర్చులన్నీ పోనూ ఎకరాకు రూ.ఐదు లక్షల వరకు లాభం వచ్చింది. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తుండటం, చలి వాతావరణం కారణంగా ఫిబ్రవరి వరకు ఆగి చెరువులు ఎండబెట్టి మరలా మోనో టైగర్‌ రొయ్యలు సాగు చేస్తా. - పాలేటి చంద్రం, రొయ్యల రైతు

పీతలు

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని