logo
Published : 01/12/2021 01:03 IST

ప్రతిభ వెలికి తీసేందుకే పోటీలు


సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల విజేతలతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేయాలని డీఈవో ఆర్‌.ఎస్‌.గంగాభవాని తెలిపారు. గుంటూరు పాతబస్టాండ్‌ కూడలిలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రాంగణంలో మంగళవారం 29వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌-2021 జిల్లా స్థాయి పోటీలను డీఈవో గంగాభవాని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను గుర్తించడంలో ఇటువంటి వేదికలు ప్రయోజనకరమని తెలిపారు. గతేడాది జరిగిన ఇన్‌స్పైర్‌ మనక్‌ వేదిక ద్వారా జిల్లాకు చెందిన విద్యార్థులు పి.కీర్తి, ఎన్‌.విష్ణువర్దన్‌రెడ్డిలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచి రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవడం అభినందనీయమన్నారు. పాఠశాల విద్య గుంటూరు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు వి.ఎస్‌.సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు నిర్వహిస్తున్న వివిధ పోటీ వేదికలపై వారు ఉత్తమ ప్రతిభ కనబరిచేలా చూడాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి విజయవాడ నుంచి సత్యనారాయణ పరిశీలకుడిగా హాజరవ్వగా, న్యాయనిర్ణేతలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ఆచార్యులు డాక్టర్‌ ఎన్‌.అంకమ్మ, ఎన్‌.ప్రవీణ్‌కుమారి, జి.క్యాథరీన్‌, కె.అపర్ణసీతారామ్‌, బి.శ్రీదేవీ, వై.లక్ష్మీప్రసన్న, ఎ.రవికుమార్‌, ఎ.శ్రీనివాసరావు, సీహెచ్‌.చారులత, వై.లక్ష్మీప్రసన్న తదితరులు వ్యవహరించారు. విద్యార్థులు రూపొందించిన 251 ప్రాజెక్టులు పరిశీలించి 13 మంది విద్యార్థులు డిసెంబర్‌ 14, 15 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఇనుమెళ్ల, చల్లగుండ్ల, ఎ.ఉల్లిపాలెం, యాజలి, బొబ్బర్లంక, లింగారావుపాలెం, శిరిగిరిపాడు, ముట్లూరు, నల్లూరిపాలెంకు చెందిన జిల్లా పరిషత్‌ పాఠశాలల విద్యార్థులు, కొల్లూరు టీజడ్పీ పాఠశాల, గుంటూరులోని సెయింట్‌ లారెల్స్‌, సెయింట్‌ ఆల్ఫోన్సా, కాటూరి పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు ఉర్దూ అర్బన్‌ పాఠశాలల ఉపతనిఖీ అధికారి ఎస్‌కేఎండీ ఖాసిం, ఏపీ కాస్ట్‌ జిల్లా సమన్వయకర్త ఎ.ఎ.మధుకుమార్‌, డిప్యూటీ డీఈవోలు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని