logo
Published : 01/12/2021 01:03 IST

సర్వీస్‌ సర్టిఫికెట్లు నిరాకరణ?

జీజీహెచ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఆవేదన

ఈనాడు, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకునేవారు గతంలో పనిచేసిన అనుభవం సర్టిఫికెట్లు జతపరచాలని అందులో స్పష్టం చేసింది. గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ప్రస్తుతం పొరుగుసేవలు, హెచ్‌డీఎస్‌ కింద నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఈసీజీ టెక్నిషియన్లు, రేడియో థెరఫిస్టు, ఫిజియోథెరపిస్టులు, ఆడియాలజిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆయాలు, బాయ్‌లుగా 400-500 మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం భర్తీ చేసే ఉద్యోగాలకు జీతం స్కేల్‌ ఎక్కువగా ఉండడంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి వీరంతా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు వారు ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి రాతపూర్వకంగా విన్నవించుకున్నారు. తామంతా పది నుంచి పదిహేనేళ్లుగా జీజీహెచ్‌లోనే పని చేస్తూ రెగ్యులర్‌ ఉద్యోగాలకు వయస్సు పెరిగిన రీత్యా అనర్హులుగా ఉన్నామని, కనీసం ఈ పోస్టుల్లో అయినా సర్దుబాటు చేయాలని కోరారు. అటు నుంచి స్పందన కొరవడడంతో దరఖాస్తు చేసుకుని పోటీ పరీక్షలో పోస్టులు దక్కించుకోవాలని చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా సంబంధిత ఉద్యోగులు ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు సర్వీస్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓ, ఏఓ, ఏడీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆస్పత్రి అధికారులు వీరి మొర ఆలకించడం లేదు. చేసిన కాలానికి ధ్రువపత్రం ఇచ్చేది లేదని నిరాకరిస్తున్నారని సంబంధిత ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. కొవిడ్‌ విపత్తు సమయంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించామని గుర్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి చేసిన సేవలకు సర్వీస్‌ సర్టిఫికెట్‌ కోరుతుంటే ఇవ్వకపోవడం దారుణమని ఉద్యోగులు వాపోతున్నారు. తాము సేవలు అందించినట్లు ఆయా విభాగాలకు చెందిన విభాగాధిపతులు ధ్రువీకరిస్తూ లెటర్‌ ఇస్తున్నారని, దానిపై సూపరింటెండెంట్‌ సంతకం చేస్తే సరిపోతుందని, తమ వినతిని పట్టించుకోవటం లేదని బాధిత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గతంలో పనిచేసిన పలువురు సూపరింటెండెంట్లు ఇలాంటి పత్రాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తమ సమస్యపై జిల్లా పాలనాధికారి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని వేడుకుంటున్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని