logo
Published : 01/12/2021 01:03 IST

మూడు వారాలుగా మురుగులోనే..!

నగరం మండలం ధూళిపూడి శివారు ఎస్సీ కాలనీ ప్రజలు మూడు వారాలుగా వర్షం నీటితో ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు సుమారు 30 గృహాలు నీటిలో నానుతున్నాయి. బాధితులు కట్టుదుస్తులతో స్థానిక దేవాలయంలో తలదాచుకుటున్నారు. ఇరవై రోజులుగా వర్షం నీరు కదలక దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కలుషితం కావడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. నీటిలో నానుతున్న నివాసాలు ఎప్పుడు కూలుతాయోనని భయపడుతున్నారు. పశుగ్రాసం వరిగడ్డి వర్షాలకు తడిసి పనికిరాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.- న్యూస్‌టుడే, ధూళిపూడి(నగరం)

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని