logo
Published : 01/12/2021 01:03 IST

భార్యాబిడ్డలను విస్మరించటమా?

కండక్టర్‌పై చట్టం ప్రకారం చర్యలకు జేసీ ఆదేశం

జిల్లాపరిషత్తు(గుంటూరు): ‘ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి భార్య, బిడ్డలను విస్మరించటమా? వెంటనే అతడ్ని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వండి. వైఖరిలో మార్పు రాకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోండి’.. అని జిల్లా సంయుక్త కలెక్టరు జి.రాజకుమారి ఆదేశించారు. నగరంలోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలో శిశు గృహ, దిశ వన్‌స్టాఫ్‌ కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. దిశ కేంద్రం ఎదుట నిలిచిన బాధితులతో ఆమె మాట్లాడి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆ సమయంలో పిడుగురాళ్లకు చెందిన చల్లా ఎలిజబెత్‌ రాణి తన భర్త శోభన్‌బాబు పొన్నూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌ అని, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను, కుమారుడి (6)ని ఇంటి నుంచి గెంటేశారన్నారు. పిడుగురాళ్ల స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, కలెక్టరుకు రెండు సార్లు, ఎస్పీకి ఒకసారి ‘స్పందన’లో అర్జీలు అందజేసినట్లు చెప్పారు. స్పందించిన జేసీ రాజకుమారి సదరు కండక్టరును వెంటనే కౌన్సెలింగ్‌కు పిలిపించాలని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పీడీ మనోరంజనిని ఆదేశించారు. కౌన్సెలింగ్‌కు రాకున్నా, భార్యాబిడ్డలను ఏలుకోవడానికి నిరాకరించినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని