logo
Published : 01/12/2021 01:03 IST

ఆంధ్ర బ్రాండ్‌ పేరుతో చేపల విక్రయ కేంద్రాలు


మాట్లాడుతున్న మత్స్యశాఖ ఉప సంచాలకుడు డాక్టర్‌ సురేష్‌

వినుకొండ, న్యూస్‌టుడే : వార్డు సచివాలయాల పరిధిలో ఆంధ్ర బ్రాండ్‌ పేరుతో చేపల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తున్నట్లు మత్స్యశాఖ జిల్లా ఉపసంచాలకుడు డాక్టర్‌ పి.సురేష్‌ తెలిపారు. మున్సిపల్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుకాణాల ఏర్పాటుకు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. సొంతంగా రూ.30 వేల పెట్టుబడికి తోడు బ్యాంకు రుణం రూ.1.70 లక్షలు సమకూర్చుతామని పేర్కొన్నారు. తీసుకున్న రుణం సులభ వాయిదాల్లో చెల్లించాలని చెప్పారు. జిల్లాలో లభించే అన్ని రకాల మత్స్య ఉత్పత్తులను సరఫరా చేస్తామని, వీటితో పాటు చేప, రొయ్య పచ్చళ్లు విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ దస్తగిరి, వైస్‌ ఛైర్మన్‌ గాబ్రీలు, కమిషనర్‌ బి.శ్రీనివాసులు, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు వెంకటేశ్వర్లు, అభివృద్ధి అధికారి కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని